»Illegal Income Of Cm Jagan In The Hands Of Avinash B Tech Ravi
Btech Ravi: అవినాష్ చేతిలో సీఎం జగన్ అక్రమ సంపాదన!
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Ys Viveka Murder Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సీబీఐ విచారణ(CBI Investigation)కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి(avinash Reddy) గైర్హాజరవుతూ వస్తున్నారు. దీంతో సీబీఐకు అవినాష్ రెడ్డికి మధ్య లేఖల పర్వం నడుస్తోంది. మరోవైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును సీఎం జగన్(Cm Jagan) అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(Btech Ravi) ఆరోపణలు చేశారు.
బీటెక్ రవి(Btech Ravi) మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ ఆస్తిని అవినాష్ రెడ్డి(avinash Reddy) కాపాడుకుంటూ వస్తున్నాడని, అందుకే ఆయన్ని అరెస్టు కానివ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ అక్రమ సంపాదన రూ.2 వేల కోట్ల రూపంలో భద్ర పరిచినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. అవినాష్ రెడ్డి వేలిముద్రలతో లాకర్లలోని రూ.2 వేల నోట్ల కట్టలను తీసి మార్చుకోలేమనే భయంతో సీఎం(Cm Jagan) నాటకాలు ఆడిస్తున్నారన్నారు.
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు. 25 తర్వాత సీబీఐ డైరెక్టర్గా కొత్తవారు రాబోతున్నారని, ఆయన వైసీపీ చెప్పినట్లు వింటారని అన్నారు. గతంలో కూడా సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి తాడేపల్లెకు సంబంధించిన పలువురి పేర్లు బయటపెట్టారని, అందుకే ఇప్పుడు సీఎం జగన్(Cm Jagan) కూడా తన పేరు బయటపడితే ఇబ్బంది తలెత్తుతుందనే భయంతో ఉన్నారన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని సీఎం జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీటెక్ రవి(Btech Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.