గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (India: The Modi Question) హైదరాబాద్ లో వివాదం రేపింది. భారతదేశంలో బీబీసీ డాక్యుమెంటరీ వీక్షించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)లో ప్రదర్శించారని సమాచారం. ఈ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ఈ డాక్యుమెంటరీపై వివాదం నడుస్తుండగా అది హైదరాబాద్ లో ప్రదర్శించేందుకు ప్రయత్నం చేయడంతో అలజడి మొదలైంది. వామపక్ష విద్యార్థి సంఘం, మరో సంఘానికి మధ్య ఘర్షణ నెలకొందని సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వర్సిటీ ఆవరణలో గురువారం సాయంత్రం ఏబీవీపీ నాయకులు కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా ఎస్ఎఫ్ఐ నాయకులు బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలా ప్రదర్శిస్తారంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విశ్వవిద్యాలయ ఆవరణలో ఎలాంటి సినిమాల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేళ వర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఆందోళనలు జరగ్గకుండా చర్యలు తీసుకున్నారు.
BBC documentary "India : The Modi Question" which was removed from youtube screened in HCU by Fraternity Movement- HCU unit#fraternityhcupic.twitter.com/HLgYAlA5UV