»Huge Earthquake In France Tsunami Warnings Issued
Earthquake Tsunami Warnings : ఫ్రాన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లో నేడు భారీ భూకంపం(Earthquake) సంభవించింది. న్యూ కలెడోనియా ప్రాంతంలో లాయల్టీ ఐలాండ్స్కు ఆగ్నేయంగా శుక్రవారం భారీగా భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫ్రాన్స్‌లో సంభవించిన ఈ భూకంపం(Earthquake)తో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. అయితే ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. న్యూ కలెడోనియా, ఫిజీ, వనాటు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.