TG: భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు తెలంగాణలో జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను ఆధునీకరించాలని సూచించారు.