హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమ(Aurobindo Pharma)లో గ్యాస్ లీక్(Gas Leak) అవ్వడంతో ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో ఆందోళన నెలకొంది. ఫార్మా కంపెనీలోని గ్యాస్ ను పీల్చడంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఫార్మా కంపెనీ యాజమాన్యం అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ ఏడుగురు కార్మికులను ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించింది. ఆ ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఏడుగురు కార్మికుల పరిస్థితి చూసి మిగతా కార్మికులంతా భయాందోళన చెందుతున్నారు.