»G7 Summit Narendra Modi Meets Ukraine President Zelenskyy In Hiroshima
G7 Summit ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలిసారి భేటీ.. యుద్ధంపైనే చర్చ
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య భారత్ కీలక పాత్ర వ్యవహరించాల్సి వస్తోంది. యుద్ధానికి పరిష్కారం చూపాలని జెలెన్ స్కీ తోపాటు ఇతర దేశాల నాయకులు భారత్ ను కోరాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యాతో చర్చలు జరిపింది.
ఏడాదిన్నరగా రష్యా (Russia)-ఉక్రెయిన్ (Ukrain) యుద్ధం జరుగుతోంది. రష్యాను నియంత్రించాలంటే అది భారత్ (India)తోనే సాధ్యమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ సమయంలో యుద్ధ బాధిత ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీతో (Volodymyr Zelenskyy) ప్రధాని నరేంద్ర మోదీ (Modi) సమావేశమయ్యారు. జపాన్ (Japan)లో హీరోషిమా (Hiroshima) నగరంలో జరుగుతున్న జీ 7 సదస్సు (G7 Summit) సందర్భంగా ఇరు నేతలు భేటీ అయ్యారు. యుద్ధం (War) ప్రారంభమై ఏడాదిన్నర తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకోవడం మొదటిసారి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య భారత్ కీలక పాత్ర వ్యవహరించాల్సి వస్తోంది. యుద్ధానికి పరిష్కారం చూపాలని జెలెన్ స్కీ తోపాటు ఇతర దేశాల నాయకులు భారత్ ను కోరాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యాతో చర్చలు జరిపింది. కాగా, గతేడాది అక్టోబర్ 4వ తేదీన జెలెన్ స్కీ భారత ప్రధాని మోదీతో ఫోన్ (Phone)లో మాట్లాడారు. ‘సైనిక పరిష్కారం’ ఉండదని.. ఎలాంటి శాంతి (Peace) ప్రయత్నాలకు అయినా కూడా మేం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ శనివారం తొలిసారి కలుసుకున్నారు.
కాగా, శనివారం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. జీ 7 దేశాల కూటమిలో భారత్ సభ్యత్వం లేకున్నా జపాన్ ప్రధాని ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు.