»Financial Crisis In America 80 Lakhs Jobs In Danger Zone
USA:లో ఆర్థిక మాంద్యం..డేంజర్ జోన్లో 80 లక్షల జాబ్స్!
గతంలో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్, ఇప్పుడు అమెరికా(America) సైతం ఆర్థిక సంక్షోభం(financial crisis)తో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో 80 లక్షల ఉద్యోగాలు(80 lakhs jobs) పోతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలెంటో ఇక్కడ చుద్దాం.
అగ్రరాజ్యం అమెరికా(America) కూడా మాంద్యం, ఆర్థిక సంక్షోభంలో చిక్కకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా, జూన్ 1వ తేదీలోపు రుణ పరిమితిని పెంచకపోతే అక్కడి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఆ దేశ ప్రభుత్వ రుణ పరిమితి పెంపుపై తగిన నిర్ణయం తీసుకోకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని, ఆర్థిక సంక్షోభాలు ఏర్పడతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా వైట్ హౌస్ రుణ పరిమితిని పెంచకపోగా ఆర్థిక సంక్షోభం(financial crisis)లో కూరుకుపోయో అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే అమెరికాలో దాదాపు 80 లక్షల ఉద్యోగాలు(80 lakhs jobs) ఊడుతాయని అంటున్నారు. దీంతోపాటు స్టాక్ మార్కెట్ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పతనం కానుందని చెబుతున్నారు. అందుకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ వైట్ హౌస్కు ఓ పత్రాన్ని సమర్పించారు.
US ప్రభుత్వ రుణ పరిమితిని జూన్ 1 నాటికి పెంచకపోతే ప్రభుత్వం దివాలా తీస్తుందని US ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ అన్నారు. దీని నుంచి బయట పడేందుకు అమెరికా పార్లమెంట్ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
US ప్రభుత్వం వివిధ ప్రజా సేవలు, ప్రభుత్వ అధికారుల జీతాలపై నెలకు 525 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇందులో సగం అంటే 225 బిలియన్ డాలర్లు నిధుల కొరత కారణంగా గత 3 నెలల్లో అప్పుగా తీసుకుని ఖర్చు చేశారు. మరోవైపు US ఇప్పటికే తీసుకున్న రుణం 31 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి అక్కడి ప్రభుత్వానికి అప్పు ఇచ్చే క్రమంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ల మధ్య విబేధాలు కూడా ఇబ్బందిగా తెలెత్తుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే భారత్తో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.