వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.