PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన మహాలక్ష్మమ్మ పనులు చేసుకొని ఆ వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఆమెకు తెలియకుండా ఎవరో బ్యాంక్ ఖాతా నుంచి నాలుగు విడతలుగా రూ.31వేల నగదు బదిలీ చేసుకున్నారు. గురువారం కొంత డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్‌కు వచ్చి ఖాతాలో ఎంత ఉన్నాయని వివరించగా, ఖాతాలో నగదు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.