Ed Again notice:కవితకు ఈడీ మళ్లీ నోటీసు..20న విచారణకు హాజరుకావాలని ఆదేశం
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha) ఈడీ (ed) ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత (Kavitha) హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో (supreme court) తాను వేసిన పిటిషన్‌పై ఈ నెల 24వ తేదీన విచారణ ఉందని కవిత (Kavitha) చెప్పారు. ఆ తర్వాత విచారణకు వస్తానని పేర్కొన్నారు. దీంతోపాటు ఇంట్లోనే (home) తనను విచారించాలని కోరారు. ఆమె విజ్ఞప్తిని ఈడీ (ed) అధికారులు తోసిపుచ్చారు. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చిచెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను (Kavitha) ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సుధీర్ఘంగా ప్రశ్నించి.. ఆమె మొబైల్ (mobile) కూడా సీజ్ చేశారు. దీంతో ఆ రోజు ఆమె అరెస్ట్ తప్పదని ప్రచారం జరిగింది. ఆ రోజు విచారించి పంపించి.. 16వ తేదీన హాజరుకావాలని నోటీసులు (notice) ఇచ్చారు. విచారణ కోసం నిన్ననే ఆమె ఢిల్లీ కూడా వెళ్లారు. ఈ రోజు ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ అడిగిన వివరాలను తన అడ్వకేట్ సోమా భరత్‌తో పంపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయనను ఈడీ మళ్లీ విచారించింది. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పారట. తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు 11 మంది (11 members) అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కవితను విచారిస్తున్నారు.