Director krish: హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్.. పిటిషన్ దాఖలు
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు దర్శకుడు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Director krish: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు దర్శకుడు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ముంబైలో ఉన్నందున రాలేకపోతున్నానని, శుక్రవారం హాజరవుతానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇందులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రిష్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా? అనే సందేహం కలుగుతుంది. మరి ఏది నిజమో తెలియాలంటే… క్రిష్ విచారణకు వస్తాడో లేదో తెలియదు. కాగా, క్రిష్ గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో 12 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సమాచారం. కొందరి కొత్త పేర్లు వినిపిస్తుండడంతో పోలీసులు విచారణకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు పరారీలో ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్ నెట్ వర్క్ పై కూడా దృష్టి సారించారు. ఈ కేసులో నిందితుడైన నీల్ ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉన్నాడు. కాగా, రాడిసన్ హోటల్లో అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేశాడు.