TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాన్యవర్ బట్టల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భవనంలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.