సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న (sayanna) కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు టిడిపి నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యారు. ఆ తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.