MBNR: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా ఉపాధి, వ్యవసాయ పథకాలకు అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24లోగా TGOBMMS పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఉపాధి పథకాలకు 21-50 ఏళ్లు, వ్యవసాయ/సోలార్ పరికరాలకు 21-60 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.