Chicken Pakodi Center Owner:ఏదైనా వ్యాపారం సక్సెస్ కావాలంటే ఫీడ్ బ్యాక్ కంపల్సరీ. ముఖ్యంగా ఫుడ్ ఐటెమ్స్ విషయంలో తప్పనిసరి.. స్టార్ హోటల్స్ కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. గల్లీలో చికెన్ సెంటర్ నిర్వాహకులు కూడా ఓర్పుతో.. సహనంతో మెలగాలి. కానీ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో గల జేఎస్ పకోడి సెంటర్ నిర్వాహకుడు జీవన్‌కు (jeevan) ఇవేమి పట్టవు. కారం ఎక్కువ ఉంది.. ఉప్పు తక్కువైందని అతనికి చెప్పొద్దు. చెబితే కత్తితో దాడి చేస్తాడు.
కేపీహెచ్‌బీ 9వ ఫేజులో జీవన్ (jeevan) పకోడి సెంటర్ ఉంది. పకోడి రుచి చూద్దామని నాగార్జున (nagarjuna) వచ్చాడు. పకోడి ఆర్డర్ చేసి ఆరగిస్తున్నాడు. అందులో కొంచెం కారం ఎక్కువయ్యింది. అందరిలాగే అతనికి చెప్పాడు. ఇంకేముంది ఓనర్ జీవన్‌కు (jeevan) ఎక్కడో మండింది.. తింటే తిను లేదంటే వెళ్లిపో అన్నాడు. మంచి చెబితే ఇలా అంటావా అని జీవన్ (jeevan) రియాక్ట్ కావడం.. అలా గొడవ ముదిరింది.
కస్టమర్ నాగార్జున (nagarjuna) కూడా ఊరుకోలేదు. మంచి చెబితే ఇలా స్పందించాడు ఏంటీ అని అర్థం కాలేదు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అక్కడే ఉన్న కత్తి తీసుకున్నాడు జీవన్ (jeevan).. నాగార్జునపై దాడి చేశాడు. దీంతో కస్టమర్ చేయి, చేతిపై గాయాలు అయ్యాయి. అడ్డుగా వెళ్లిన ప్రణీత్ రెడ్డికి (praneeth reddy) తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రణీత్, నాగార్జునను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చికెన్ పకోడి నిర్వాహకుడు జీవన్ (jeevan) తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాస్త ఓపిక లేకుండా ఇలా చేశాడెంటీ అని మండిపడుతున్నారు. కస్టమర్ చెప్పే అంశాల ఆధారంగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి.. జీవన్ తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది.