కోనసీమ: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాజోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజోలు, అమలాపురం క్రైం సీఐలు నరేశ్ కుమార్, గజేంద్ర శుక్రవారం తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దొంగతనాలు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 64 గ్రాములు బంగారం, 2 కేజీల వెండి, స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు.