ATP: అనంతపురం జిల్లాలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం రాయదుర్గం నియెజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో డి. హిరేహల్ మండలం SR కోట గ్రామం సమీపంలో పిడుగు పడింది. కొబ్బరి చెట్టుపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.