NDL: ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన శీలం మాధవి (45) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, భర్త శీలం చిన్నరాజు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.