»Bridal Dance With Lehenga Dress Natu Natu Song Viral Video
Viral Video: లెహంగాలో పెళ్లి కుమార్తె.. నాటు నాటు పాటకు డాన్స్
ఓ పెళ్లి వేడుకలో వధువు లెహంగాను(lehenga dress) పట్టుకుని నాటు నాటు పాటకు డాన్స్(dance) చేసింది. వరుడితోపాటు స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. నెట్టింట వైరల్(viral) అవుతున్న ఈ వీడియో(video) ఎలా ఉందో ఓ సారి చూసేయండి మరి.
మన దేశంలో పెళ్లిళ్ల వేడుకలో డాన్స్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ మధ్య సోషల్ మీడియా(social media) వచ్చిన తర్వాత కొన్ని జంటలు ఎంగేజ్ మెంట్, పెళ్లి, రిసెప్షన్ సహా అనేక వేడుకల్లో నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లిల సందర్భంగా వైరల్ అయిన అనేక వీడియోలు చుశాం. తాజాగా ఓ వివాహ వేడుకలో పెళ్లికూతురు వరుడితోపాటు తన లెహంగాను(lehenga dress) పట్టుకుని నాటు నాటు పాటకు(natu natu song) డాన్స్(dance) చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ చక్కర్లు కోడుతుంది.
వీడియోలో వధువు ఒక చేయితో లెహంగాను పట్టుకుని.. మరొక చేయితో వరుడిని పట్టుకుని అదిరిపోయే విధంగా స్టెప్పులు(steps) వేసింది. ఆ క్రమంలో వరుడు సైతం ఆమెకు సపోర్టుగా నిలిచాడని చెప్పవచ్చు. ఆ క్రమంలో ఆమె లెంహంగాను మరొకవైపు వరుడు పట్టుకోవడం విశేషం. ఆ విధంగా వారు డాన్స్(dance) చేస్తుండగా..పక్కనే ఉన్న కొంత మంది చప్పట్లు కొట్టడం వీడియోలో చూడవచ్చు. మరికొంత మంది వారి నృత్యాన్ని చూసి చిరునవ్వులు చిందించారు.
ఈ వీడియో మార్చి 12న ఇన్ స్టా(instagram)లో పోస్ట్ చేయగా..ఇప్పటి వరకు మూడు లక్షల మందికిపైగా వీక్షించారు. మరోవైపు 12 వేల మంది కంటే ఎక్కువ లైక్‌లు ఈ వీడియోకు వచ్చాయి. ఇది చూసిన పలువురు కామెంట్లు కూడా చేశారు. మీ జంట చూడముచ్చటగా ఉందని ఓ వ్యక్తి అనగా…ఇంకో వ్యక్తి చాలా బాగా డాన్స్ చేశారని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి చాలా ఎనర్జిటిక్‌గా నృత్యం చేశారు. చాలా బాగుందని కామెంట్ చేశారు. ఇక RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు రావడంతో ఈపాట మరింత ఎక్కువ మందికి చేరువైందని చెప్పవచ్చు. సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్(comment) రూపంలో తెలియజేయండి.