»Breaking Once Again In Tirumala Planes Are In Chaos Devotees Are On Fire
Breaking: తిరుమలలో మరోసారి విమానాలు కలకలం..భక్తులు ఫైర్
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల కొండ(Tirumala Temple)పై గతంలో విమానాలు(Airplanes) వెళ్లిన ఘటనలు పలుమార్లు జరిగాయి. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారంగా శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించకూడదు. అటువంటివి కొండపై నిషిద్ధం. అయితే గత కొన్ని రోజుల వ్యవధిలోనే వెంకన్న ఆలయం(Temple)పై విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ ఘటనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నేడు మరోసారి రెండు విమానాలు(Airplanes) తిరుమల ఆలయం(Tirumala Temple) గగనతలంపై ప్రయాణించాయి. అందులో ఓ విమానం ఆలయం గోపురంపైన గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించింది. ఇంకో విమానం ఆలయానికి సమీపం నుంచి ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
తిరుమల ఆలయం(Tirumala Temple)పైకి విమానాలు రాకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చెబుతున్నప్పటికీ కేంద్ర విమానయాన శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తాజా ఘటనతో మరోసారి ఆ విషయం స్పష్టమైంది. కొండపైకి విమానాలు(Airplanes) రావడం అనేది ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విషయంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు.