»Heavy Rain Forecast For Coastal Andhra Imd Warning
Rain Alert: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..ఐఎండీ హెచ్చరిక
రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు(Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీనిపై భారత వాతావరణ సంస్థ (IMD) కీలక సమాచారాన్ని వెల్లడించింది. గత 24 గంటల్లో రుతుపవనాలు దేశంలోని మారుమూల భాగాలకు వ్యాపించినట్లు తెలిపింది. రుతుపవనాల గమనానికి వాతావరణ(Weather) పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ(IMD) పేర్కొంది.
రుతుపవనాలు(Monsoons) విస్తరిస్తుండగా మరోవైపు ఉత్తర మధ్యప్రదేశ్, ఆ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ(Weather) తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రకు భారీ వర్షసూచన ఉందని, మరో నాలుగు రోజుల పాటు కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పొడిగా ఉన్నప్పటికీ అక్కడక్కడ మోస్తరు వర్షాలు(Rain) కురుస్తాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది. దక్షిణాదిన కేరళ, కర్ణాటక, కోస్తా జిల్లాల్లో రాగల వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.