చెన్నై-బెంగళూరు ప్రాంతాల్లో వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కుప్పం సరిహద్దులోని బిస్సానత్తం స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ట్రైన్ లోని కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ట్రైన్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.
దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.