»Bill Gatess Eldest Daughter Jennifer Welcomes First Baby
Jennifer Gates First Baby తాత అయిన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్..
బిల్ గేట్స్ ఉదార స్వభావుడు. తన సంపాదనలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. తాను ఏర్పాటుచేసిన చారిటీ సంస్థకు వేల కోట్లు విరాళంగా ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన సంస్థ ద్వారా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేయిస్తున్నాడు.
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సంస్థ (Microsoft Co Founder) వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తాత అయ్యాడు. ఆయన కుమార్తె జెన్నీఫర్ గేట్స్ (Jennifer Gates) పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా పాప కనిపించకుండా కేవలం పాదాల ఫొటోను అభిమానులతో పంచుకుంది. తమ ఇంట్లోకి మరొకరు రావడంతో బిల్ గేట్స్ కుటుంబం ఆనందంలో మునిగింది. ఈ విషయమై బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ (Melinda French Gates) హర్షం వ్యక్తం చేస్తూ వాళ్లు ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ ఉంచారు.
దాదాపు ఐదేళ్లుగా సహజీవనం (Dating) చేసిన అనంతరం తన ప్రియుడు నయెలో నాజర్ (Nayel Nassar)ను 2021 అక్టోబర్ లో జెన్నీఫర్ గేట్స్ ప్రేమ వివాహం చేసుకుంది. న్యూయార్క్ (New York)లోని వెస్ట్ చెస్టర్ లో వీరు నివసిస్తున్నారు. తాను తల్లిని కాబోతున్నట్లు గత డిసెంబర్ లో ప్రకటించింది. ఆ సందర్భంగా కొన్ని బేబీ షవర్ (Baby Shower) ఫొటోలను పంచుకుంది. తాజాగా పాపకు జన్మనివ్వడంతో గేట్స్ కుటుంబమంతా ఆనందంలో మునిగింది. ‘జెన్నీ-నయేల్ కు శుభాకాంక్షలు. నాకు చాలా గర్వంగా ఉంది’ అని బిల్ గేట్స్ పేర్కొన్నాడు. ‘ప్రపంచంలోకి స్వాగతం. నా హృదయం ఉప్పొంగుతోంది’ అని అమ్మమ్మ మెలిందా సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. జెన్నీ- నాయెలో వీరిద్దరూ గుర్రపు స్వారీలో ఆరి తేరినవారు. భర్త నయెలో అయితే ఒలింపిక్స్ లో గుర్రపు స్వారీలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులైన వారికి అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా బిల్ గేట్స్ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు జెన్నీఫర్ గేట్స్. బిల్ గేట్స్ ఉదార స్వభావుడు. తన సంపాదనలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. తాను ఏర్పాటుచేసిన చారిటీ సంస్థకు వేల కోట్లు విరాళంగా ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన సంస్థ ద్వారా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేయిస్తున్నాడు. దీని బాధ్యతలను అతడి మాజీ సతీమణి మిలిందా గేట్స్ చూసుకునేది. బిల్ గేట్స్ దంపతులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు.