»Holi 2023 Farrukhabad Inspector Leave Letter Goes To Viral
SI Letter Viral నా భార్య అలిగింది.. పది రోజుల సెలవు కావాలి? ఎస్సై లేఖ వైరల్
గతంలో కూడా ఇలాంటి లేఖలు తెగ వైరలయ్యాయి. కొందరు ఈ లేఖలు చూసి నవ్వుతున్నారు. కానీ ఇది చాలా తీవ్రమైన సమస్య. మన కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిని చూసి ఎగతాళి చేయడం.. నవ్వుకోవడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగం.. పోలీసే కదా అని తీసి పారేయకండి. వారిని గౌరవించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
పోలీస్ ఉద్యగమం (Police Job)టే కత్తి మీద సాములాంటిది. ప్రజలను (Public) కాపాడడంలో నిత్యం బిజీగా ఉండే జీవులు వాళ్లు. తమ వ్యక్తిగత జీవితా (Personnel Life)న్ని త్యాగం చేసి సురక్షిత జీవితం ప్రజలకు ఇస్తారు. వారి జీవితంలో పండుగలు (Festivals), శుభకార్యాలకు అంతగా స్థానం ఉండదు. కుటుంబసభ్యులు (Family), స్నేహితుల (Friends)తో సరదాగా (Joyful) గడిపే తీరిక వారికి ఉండదు. వ్యక్తిగత జీవితంలోని ఆనందాలకు దూరమవుతుంటారు. ఆ విధంగానే ఓ ఇన్ స్పెక్టర్ (Sub Inspector-SI) వరుసగా 20 ఏళ్లు హోలీ పండుగ (Holi Festival)ను చేసుకోలేకపోతున్నాడు. అత్తింట్లో ఘనంగా జరిగే వేడుకకు తన భార్యను తీసుకెళ్లలేకపోతున్నాడు. ఇది కాస్త వారింట్లో గొడవలకు దారి తీసింది. రెండు దశాబ్దాలై (Decades)న హోలీ పండుగకు తనను పుట్టింటి తీసుకెళ్లడం లేదని ఆమె అలిగింది. ఆమె అలక ఈసారి తీవ్రస్థాయిలో ఉంది. తన కాపురంలో చీలిక మొదలవుతుందని భయపడిన ఆయన ఏకంగా అది విషయం స్పష్టంగా చెబుతూ ఉన్నత అధికారులకు లేఖ (Leave Letter) రాశాడు. ‘నా భార్య అలిగింది.. ఓ పది రోజులు సెలవు ఇవ్వండి’ అంటూ సెలవు పత్రం రాశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఫరూఖాబాద్ (Farrukhabad)లో ఎస్సై అశోక్ కుమార్ (Ashok Kumar). ‘పెళ్లయిన 22 ఏళ్ల నుంచి హోలీ పండుగ కోసం తన పుట్టింటికి తీసుకెళ్లలేదని నా భార్య అలిగింది. ఆమెను శాంతపరచాలంటే పది రోజులు సెలవు కావాలి. ఇప్పుడు వచ్చే హోలీ పండుగకైనా నా భార్య నాతో కలిసి పుట్టింటికి వెళ్దామని చెబుతోంది. కచ్చితంగా నాకు సెలవులు అవసరం. సర్ నా సమస్యను అర్థం చేసుకుని పది రోజుల పాటు మార్చి 4వ తేదీ నుంచి సెలవు ఇవ్వాలని కోరుతున్నా’ అని అశోక్ లేఖలో తెలిపాడు. ఈ లేఖ సామాజిక మాధమ్యాల్లో తెగ వైరలైంది. అయితే అతడి లేఖను చూసిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా స్పందిస్తూ.. అయితే పది రోజులు కుదరదు. ఐదు రోజులు సెలవులు ఇస్తున్నా. వెళ్లి రా అని చెప్పాడు.
గతంలో సరిహద్దులో బందోబస్తు చేస్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) కూడా ఇదే విధంగా లేఖ రాశాడు. కొత్తగా పెళ్లయిన ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ ఇండో-నేపాల్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవు పెట్టి పుట్టింటికి రాలేదని అలిగిన భార్య ఫోన్ ఎత్తడ లేదని చెబుతూ ఆమెతో మాట్లాడేందుకు సెలవు కావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి లేఖలు తెగ వైరలయ్యాయి. కొందరు ఈ లేఖలు చూసి నవ్వుతున్నారు. కానీ ఇది చాలా తీవ్రమైన సమస్య. మన కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిని చూసి ఎగతాళి చేయడం.. నవ్వుకోవడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగం.. పోలీసే కదా అని తీసి పారేయకండి. వారిని గౌరవించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.