»Komatireddy Venkat Reddy Audion Call Viral On Dr Cheruku Sudhakar
Audio Leak కోమటిరెడ్డి ఆడియో కలకలం.. చెరుకు సుధాకర్ ను చంపేస్తాం
కోమటిరెడ్డి ఆడియోలు గతంలో కూడా పలు బయటకు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసుకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచుల దాక చేరడానికి కారణం వెంకట్ రెడ్డి కారణమని అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో మరో ఆడియో (Audio) కలకలం రేపుతోంది. భువనగిరి (Bhuvanagiri) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్వరంగా వినిపిస్తున్న ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ (Phone Call Recording) కాంగ్రెస్ పార్టీలో అలజడులు సృష్టిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్ గా భావిస్తున్న ఆ ఆడియోలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Dr Cheruku Sudhakar), ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్ (Dr Cheruku Suhas) ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టు ఉంది. ఈ ఆడియోలో వారిద్దరినీ అసభ్యంగా దూషిస్తుండడం వివాదానికి కేంద్రమైంది. దీనిపై తీవ్ర దుమారం రేపుతోంది.
ఆడియో ఇలా ఉంది.
‘చూసినవా స్టేట్ మెంట్’
‘అంకుల్ అది వాట్సప్ అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి’
ఏం చూసుడు. వాన్ని చంపుతామని తిరుగుతున్నారు. వంద మంది వెహికిల్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెల రోజులు ఓపిక ఇప్పుడు వంద కార్లలో వాడిని చంపుతామని తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాడిని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు.. వార్నింగ్ ఇస్తున్నా.
‘నేను ఆపలేను. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకుని మొన్న స్టేట్ మెంట్లు ఇచ్చిండు. ఓపిక పట్టిండ్రు. యాడ దొరికితే అక్కడ చంపేస్తామని అంటున్నారు. వాళ్లను ఆపుడు నా వల్ల కాదు. క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. ’
‘నిన్ను కూడా చంపుతారు చెబుతున్నా. అరేయ్ నీ ఆస్పత్రి నడువదు. అతడికి ఫోన్ చేసి చెప్పు. అరేయ్ నీకు ఉన్నదా రా.? ఇంటి పార్టీ ఏందిరా? నువ్వు కౌన్సిలర్ గా గెలవవు. ఆయన అంతపెద్ద లీడర్ అని చెప్పు. వాడు జైళ్లో పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే. చెప్పు.. వారం కంటే ఎక్కువ ఉండడు వాడు’’ అని బెదిరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది.
ఈ ఆడియో లీక్ పై చెరుకు సుధాకర్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డి ఆడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్లగొండ (Nalgonda) పట్టణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎంపీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ ఆడియో విషయమై ప్రస్తావించగా.. కోమటిరెడ్డి ఆ ఆడియో తనది కాదని స్పష్టం చేయలేదు. కాగా కోమటిరెడ్డి ఆడియోలు గతంలో కూడా పలు బయటకు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసుకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచుల దాక చేరడానికి కారణం వెంకట్ రెడ్డి కారణమని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి వెంకట్ రెడ్డి ధోరణే ప్రధాన కారణం. ఈ ఆడియోపై కూడా పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఈ వ్యవహారంపై చెరుకు సుధాకర్ స్పందిస్తూ.. ‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతి ఉండి మాట్లాడుతుండో.. లేకుండా మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. ఒకే పార్టీలో పని చేస్తున్నా నాపై అత్యంత దారుణంగా.. టెర్రరిస్టు భాష మాట్లాడాడు. ఈ వ్యవహారంపై పార్టీ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లాను. వారిద్దరికీ ఆడియో పంపించా. కోమటిరెడ్డి నన్ను ఏం చేయలేడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి’ అని తెలిపాడు.