»Minister Komatireddy Venkat Reddy Angry On Telugu Film Industry
Komatireddy: తెలుగు సినిమా ఇండస్ట్రీ పై మంత్రి సీరియస్ ..!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తనను కలువకపోవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. దిల్ రాజు తప్ప మిగిలిన వారు ఎవరూ కోమటిరెడ్డిని కలిశారు.
Minister Komatireddy Venkat Reddy angry on Telugu film industry
Komatireddy: ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkat Reddy) సినిమాటోగ్రఫీ మంత్రి పదవీ వరించింది. మంత్రి పదవీ ఇచ్చిన తర్వాత, నిర్మాత దిల్ రాజు తప్ప ఇండస్ట్రీ నుంచి ఎవరూ విష్ చేయకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు.
తెలంగాణ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి ఇతర పార్టీల నాయకులు, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు సినీ నటులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపగా, కోమటిరెడ్డికి స్వాగతం పలకడం మాత్రం విస్మరించారు. సినీ పరిశ్రమ నిర్లక్ష్యంపై కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.