»Komatireddy Venkat Reddy Special Status Should Be Given To Ap
Komatireddy Venkat Reddy:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశాారు. రాష్ట్రం విభజన జరిగే సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్రం హమీ ఇచ్చిందని తెలిపారు.
Komatireddy Venkat Reddy: Special status should be given to AP
Komatireddy Venkat Reddy: విభజన హామీలను కేంద్రం మరిచిపోయిందని, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతుందని, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడం ఏంటని మంత్రి ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, దీని కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా సాహకరిస్తుందని తెలిపారు.
ఢిల్లీ(Delhi)లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్‌కు వెళ్లాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై చర్చిస్తామని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) చైర్మన్ ను కలవనున్నట్లు చెప్పారు. తెలంగాణలో 340 కిలోమీటర్ల హైవేను ఆరు లైన్లుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.