Bill Gates: మురుగు కాలువలోనికి బిలియనీర్.. ఏం చేశారంటే..?
బిలియనీర్ బిల్ గేట్స్ మురుగు కాలువ లోనికి వెళ్లారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Bill Gates: బిలియనీర్ బిల్ గేట్స్ (Bill Gates) సింపుల్‌గా ఉంటారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న సరే అతని శైలిలో ఏ మార్పు లేదు. ధన, ధర్మాలు చేయడం.. సింపుల్‌గా లైఫ్ లీడ్ చేయడం అతనికి అలవాటు. ఈ నెల 19వ తేదీన వరల్డ్ టాయిలెట్ డే అనే సంగతి తెలిసిందే. ఆ రోజున బ్రస్సెల్స్‌లో గల మురుగు కాలువ లోపలికి దిగారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
లోపలికి దిగి మురుగునీటి వ్యవస్థ, చరిత్రను బిల్ గేట్స్ (Bill Gates) అన్వేషించారు. సిటీ వ్యర్థ వ్యవస్థ క్లిష్టమైన పనితీరు అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. 200 మైళ్ల మురుగు కాలువ, ట్రీట్మెంట్ ప్లాంట్ నెట్ వర్క్ సిటీలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తోంది. సిటీ మురుగునీటి వ్యవస్థ చరిత్ర డాక్యుమెంట్ చేస్తున్నానని పేర్కొన్నారు. 1800లో బ్రస్సెల్స్‌లో మురుగునీటిని సెన్నె నదిలోకి వెళ్లేది. దీంతో అప్పుడు కలరా వ్యాధి ప్రబలింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. గత జ్ఞాపకాల నుంచి మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పారిశుద్ధ్య సమస్యలపై జనాలకు అవగాహన కల్పించడంలో బిల్ గేట్స్ ముందుంటారు. ఇప్పుడే కాదు 2015లో కూడా ఇలా అవెర్ నేస్ కల్పించారు. మలాన్ని శుద్ధి చేసి దాని నుంచి శాస్త్రవేత్తలు నీరు తీశారు. ఆ నీటిని బిల్ గేట్స్ తాగారు. 2016లో కూడా ఇలానే అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించి, సురక్షితంగా ఉండేందుకు ఇలా చేస్తున్నానని చెబుతుంటారు. 2018లో బీజింగ్‌లో జరిగిన రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్ పోలో కూడా బిల్ గేట్స్ పాల్గొన్నారు. తన మాజీ భార్యకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సమస్యలను పరిష్కరించే పనిలో గేట్స్ నిమగ్నం అయ్యారు.