»Galaxy Cargo Ship Hijack Yemens Houthi Rebels Videos Released
Galaxy Cargo ship: హైజాక్ వీడియో రిలీజ్..నెట్టింట వైరల్
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు క్యారియర్ గెలాక్సీ లీడర్ షిప్ ను హైజాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
యెమెన్ ఇరాన్-మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు(houthi rebels) ఇటివల దక్షిణ ఎర్ర సముద్రంలోని కార్గో షిప్ గెలాక్సీని(galaxy Cargo ship) హైజాక్(hijack) చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని రిలీజ్ చేశారు. ఆదివారం నాటి వారి ఆపరేషన్‌లో ముందుగా ప్లాన్ చేసిన మీడియా భాగం ఉందని వీడియో ఉనికి ద్వారా తెలుస్తోంది. అయితే వీడియోలో Mi-17 హెలికాప్టర్ ఓడ దగ్గరికి రాగానే దానికి అమర్చిన హై-డెఫినిషన్ కెమెరా వారి కదలికలను రికార్డ్ చేసింది. ఆ క్రమంలో తిరుగుబాటుదారుల బృందం హెలికాప్టర్ నుంచి కిందకు దూకడం కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంలో కార్ క్యారియర్ టాప్ డెక్‌పైకి అందరూ ఒక్కరొక్కరుగా వెళ్లారు. ఒక వ్యక్తి వారి కదలికలను సంగ్రహించడానికి హెల్మెట్ మౌంటెడ్ కెమెరాను ఆన్ చేశాడు.
NEW VIDEO: Yemen’s Houthi rebels hijack a cargo ship in the Red Sea over the weekend pic.twitter.com/pkkUJpbe5c
ఆ క్రమంలో తిరుగుబాటుదారులు(rebels) సమన్వయంతో కూడిన ఆపరేషన్‌లో బోర్డింగ్ బృందం దగ్గరకు చేరుకుని వారిని బెదిరించారు. బోర్డింగ్ బృందాన్ని తుపాకీలతో బెదిరించి సిబ్బందిని అదుపుచేశారు. అంతేకాదు వారిని చేతులు పైకేత్తాలని సూచించి నియంత్రించారు. బోర్డింగ్ టీమ్‌లోని ఒక సభ్యుడు ఖాళీ కార్ డెక్ గుండా వెళుతూ నినాదాలు చేస్తూ తన తుపాకీని ఊపుతూ కనిపించాడు. అయితే ఈ సంఘటన పట్టపగలు జరిగినట్లు ఫుటేజీలో తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో(red sea) ఇది కూడా ఒకటి.
ఉత్తర యెమెన్‌ను నియంత్రించే హౌతీ తిరుగుబాటు మిలీషియా ఇజ్రాయెల్‌తో అనుసంధానించబడిన ఓడను స్వాధీనం చేసుకున్నట్లు, సిబ్బందిని బందీలుగా పట్టుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ నౌకను NYK నిర్వహించే PCTC గెలాక్సీ లీడర్‌గా గుర్తించారు. ఈక్వాసిస్ రికార్డు ప్రకారం ఇది ఐల్ ఆఫ్ మ్యాన్-ఇన్కార్పొరేటెడ్, ఇజ్రాయెల్ యాజమాన్యంలోని సంస్థ రే కార్ క్యారియర్స్ ద్వారా వాణిజ్యపరంగా నిర్వహించబడుతుంది. అయితే ఈ ఘటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. హైజాకింగ్ “ప్రపంచ పర్యవసానానికి చాలా తీవ్రమైన సంఘటన” అని ఆదివారం హెచ్చరించింది. నౌకలో 25 మంది నావికులు ఉన్నారు. ఈ దాడిని ఇరాన్ ఉగ్రవాద చర్యగా ఇజ్రాయెల్ అభివర్ణించింది.
హౌతీ దుండగులు భారత్ వస్తున్న కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రవాణా మార్గానికి అడ్డంకులు సృష్టించారు. అయితే ఆ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన 50 మంది నావికులు ఉన్నారని తెలిసింది.