»Cargo Ship To India Hijacked By Houthi Rebels Red Sea
Bharatకు కార్గో షిప్..హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
హౌతీ దుండగులు భారత్ వస్తున్న కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రవాణా మార్గానికి అడ్డంకులు సృష్టించారు. అయితే ఆ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన 50 మంది నావికులు ఉన్నారని తెలిసింది.
Cargo ship to India hijacked by Houthi rebels red sea
టర్కీ నుంచి భారత్(bharat)కు బయల్దేరిన కార్గో షిప్‌ను ఎర్ర సముద్రం(red sea)లో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన 50 మంది నావికులు ఉన్నారు. అయితే అందులో భారతీయులు ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. బ్రిటిష్ కంపెనీకి చెందిన ఈ నౌకను జపాన్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ హైజాకింగ్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ మద్దతుగల హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్‌పై దాడిని నిలిపివేసే వరకు నౌకలపై దాడులు కొనసాగిస్తామని హౌతీలు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి వారికి ఇరాన్ నుంచి అన్ని రకాల సహాయం అందుతోంది.
Who are the Houthi terrorists in Yemen and what do they have to do with Israel? Earlier today the Houthis hijacked a cargo ship in the Red Sea that was partly owned by an Israeli businessman and for weeks, they’ve been firing missiles and drones at Eilat, in southern Israel.… pic.twitter.com/XVPs5RgGEF
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. అంతర్జాతీయ షిప్పింగ్‌పై ఇరాన్(iron) దాడిని మేము ఖండిస్తున్నామని తెలిపింది. ఓడ బ్రిటీష్ కంపెనీకి చెందినది, జపనీస్ సంస్థ చావలేట్ యాజమాన్యంలో ఉందని పేర్కొంది. తుర్కెస్తాన్ మీదుగా ఓడలు భారతదేశానికి(india) బయలుదేరి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ షిప్ లో ఇది వివిధ దేశాల నుంచి సిబ్బందిని కలిగి ఉండగా..వారిలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.