»Bill Gates Air Travel In Economy Class For Years Do You Know The Reason
Bill Gates: ఏళ్ల పాటు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం.. ఎందుకంటే..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Bill Gates: చాలామంది ధనవంతులు ఎక్కువగా సాధారణంగా ఉంటారు. కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నప్పటికీ.. సాధారణ దుస్తులు ధరిస్తూ.. సింపుల్‌గా ఉంటారు. ఇలా కొంతమంది సాధారణ ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి వారిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒకరు. ఆయన గురించి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
For many years, Bill Gates used to fly Economy, not because he couldn’t afford First Class, but because he didn’t consider it good value. It’s five or six times more expensive, but only marginally better (and you all get to your destination at the same time).
విమానంలో సామాన్యులు ప్రయాణించే ఎకానమీ క్లాస్‌లోనే బిల్‌గేట్స్ ఎక్కువగా వెళ్లేవారు. బిజినెస్ క్లాస్‌లో టికెట్ కొనే స్తోమత ఉన్నప్పటికీ.. ఎకానమీలోనే ప్రయాణించేవారు. బిజినెస్ క్లాస్‌కు చెల్లించే డబ్బులకు పొందే సేవ, సదుపాయాలకు సంబంధం లేదని బిల్ గేట్స్ అభిప్రాయం. ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే బిజినెస్ క్లాస్‌కి 9రెట్లు అధికంగా డబ్బు చెల్లిస్తున్నప్పటికీ.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రాంగానే ఉంటాయని భావించేవారు. ఏ క్లాస్‌లో ప్రయాణించినా సరే చివరికి అందరూ చేరేది ఒకే సమయానికే, గమ్యస్థానానికి అయినప్పుడు అధికంగా ఎందుకు చెల్లించాలని అనేవారట. ఈ విషయాన్ని మార్క్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.
తన గురించి మార్క్ రాండోల్ఫ్ కొన్ని విషయాలు తెలిపారు. తనకు కాస్ట్లీ కారు కొనే స్తోమత ఉన్నప్పటికీ.. వోల్వో స్టేషన్ వ్యాగన్‌నే వాడుతున్నానని వివరించారు. తన అవసరాలు దానితో తీరిపోతున్నప్పుడు ఖరీదైన కార్ల గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదన్నారు. 35 డాలర్ల వైన్‌తో వచ్చే ఆనందం, 1000 డాలర్ల వైన్‌తో వచ్చే ఆనందం ఒక్కటే అయినప్పుడు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. డబ్బుతో కనీస అవసరాలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ సంపాదించడానికి పెద్దగా సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదు. సంపాదిస్తే మనకి నచ్చినట్లుగా సమయాన్ని వినియోగించుకోవచ్చు. సమయాన్ని నచ్చినట్లుగా గడపడం కంటే ఆనందం ఇంకా ఏముంటుందని మార్క్ తెలిపారు.