భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
తెలంగాణ (Telangana)లో కొలువైన భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయం (Bhadrachalam Sree Seetha Ramachandra Swamy Temple)లో శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రసిద్ధి పొందిన ఈ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నవమి నాడు జరిగే సీతారామచంద్రుల కల్యాణోత్సవానికి దేశం నలువైపులా నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ కల్యాణోత్సవం కనులారా వీక్షించాలని భక్తులు భావిస్తుంటారు. మార్చి 30న శ్రీరామనవమి నాడు జరిగే కల్యాణోత్సవానికి ఇప్పటికే టికెట్లను (Tickets) అందుబాటులో ఉంచారు. మరోవైపు ఈ వేడుకకు రావాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వాన లేఖలు పంపించారు.
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు (Bhadrachalam Brahmotsavam-2023) జరుగనున్నాయి. ఈనెల 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపం (Mithila Mandap)లో కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మరోవైపు స్టేడియంలో 15 వేల మంది ఉచితంగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. ఇక మార్చి 31వ తేదీన నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులో ఉంచామని, ఈసారి 3 రకాల ధరలతో టికెట్లను విక్రయిస్తున్నట్లు ఈవో ప్రకటించారు. కల్యాణోత్సవంలో భక్తులు తరించాలని ఆమె కోరారు. టికెట్లను ఆలయ అధికారిక వెబ్ సైట్ https://www.bhadrachalarama.org/లో గానీ, ఆలయ కార్యాలయంలో నేరుగా గానీ పొందవచ్చని స్పష్టం చేశారు.
కాగా భద్రాది కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)లో కొలువైన ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. భద్రాచలంలో కనులపండువగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వీఐపీలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కల్యాణోత్సవానికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.