»Avinash Reddy Filed A Petition At Telangana High Court
telangana high courtలో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్.. ఆడియో, వీడియో రికార్డింగ్‌తో విచారణ అంటూ
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
Avinash reddy filed a petition at telangana high court
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (avinash reddy) తెలంగాణ హైకోర్టులో (high court) రిట్ పిటిషన్ వేశాడు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను ఆడియో (audio), వీడియో (video) రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని.. ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి భాష్కర్ రెడ్డిని ఈ నెల 12వ తేదీన విచారిస్తామని సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail)లోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది.
వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen), అవినాష్‌ను (avinash) విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక కుట్రను ఛేదించేందుకు ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి (vivekananda reddy) చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో సిట్ (sit) దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత వివేకా (viveka) కూతురు కోరడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో రోజుకో పేరు రావడం.. వారిని విచారణకు పిలువడం జరుగుతూనే ఉంది. భారతీ పీఏ నవీన్ (naveen) పేరు తెరపైకి వచ్చింది. ఆయన జగన్ (jagan), భారతీకి (bharathi) దగ్గరి వ్యక్తి.. గత 15 ఏళ్లుగా వారితో ఉంటున్నారని తెలిసింది.