»Ap High Court Granted Regular Bail To Chandrababu In Skill Scam Case
Skill development scam caseలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లి కార్జున్ రావు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చంద్రబాబు మద్యంతర బెయిల్ పై ఉన్నారు. అంతేకాదు ఈనెల 28 రాజమండ్రి జైలుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఈనెల 30 మాత్రం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
ఆగస్టు 9న స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నాయుడుకు బెయిల్ మంజూరు చేయరాదని సుధాకర్ రెడ్డి తీవ్రంగా వాదించారు. అలాగే ఆరోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చిన షరతులను కూడా నాయుడు ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. మరీ ముఖ్యంగా హవాలా లావాదేవీల ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్ము కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని, దీనిపై కూడా సీఐడీ విచారణ జరుపుతోందని ఏఏజీ తెలిపారు.
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయానే అంశంపై ఎంపీ రఘురామ రాజు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది.