Devara: షూటింగ్లో శ్రీకాంత్ కు గాయాలు..ఎన్టీఆర్ సేఫ్?
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇసుకలో వేగంగా రన్నింగ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు బెనికింది. దీంతో ఆస్పత్రిలో చేరగా..వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ హీరోకు ఏమైందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలతోపాటు అనేక క్యారెక్టర్లు చేస్తు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే గతంలో అఖండ చిత్రంలో మంచి ఆఫర్ దక్కించుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కోట బొమ్మాలి పీఎస్ చిత్రంలో కూడా ఈ హీరో ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఆ క్రమంలో శ్రీకాంత్ కాలికు ఉన్న పట్టి గురించి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అడిగారు. దీంతో శ్రీకాంత్ జరిగిన విషయం తెలిపాడు.
ఇటివల దేవర మూవీని గోవాలో షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ చెప్పాడు. అక్కడ ఉన్న ఇసుక దిబ్బల్లో రన్నింగ్ చేస్తున్న నేపథ్యంలో కాలు బెణికిందని అన్నారు. ఆ క్రమంలోనే చిన్న గాయమే అనుకుని షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. ఆ నేపథ్యంలో ఆ గాయం ఇంకా పెరిగి కాలు వాపు వచ్చినట్లు తెలిపారు. ఇక అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడని చెప్పారు. అయితే నాగ్ సరదాగా తారక్ వళ్ల ఈ ప్రమాదం జరిగిందా అని ప్రశ్నించారు. కానీ తారక్ వల్ల ఆ ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ప్రస్తుతం ఎన్టీఆర్ సేఫ్ గా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తయా అనే విషయం తెలియరాలేదు. శ్రీకాంత్ ఇటివల కోట బొమ్మాాళి చిత్రంలో యాక్ట్ చేయగా..అది ఈ వారం విడుదల కానుంది. ఇక తాను యాక్ట్ చేస్తున్న మరో చిత్రం దేవర.