»Anupama Parameswaran Released The Trailer Of Vimanam Movie
Vimanam: ‘విమానం’ ట్రైలర్ రిలీజ్ చేసిన అనుపమ పరమేశ్వరన్
భావోద్వేగాల కలయికగా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ విమానం మూవీ ట్రైలర్(vimanam trailer) తాజాగా విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ వీడియోను యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేశారు.
బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు..పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్. vimanam సినిమా ట్రైలర్(trailer)ను గురువారం (జూన్ 1) రోజున ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్. హృదయాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే విమానం. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే స్పష్టమవుతుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరి జీవితాల్లో బలమైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోషన్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ సినిమాను రూపొందించాం. జూన్ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందన్నారు. ఇంత మంచి సినిమాను రూపొందించటానికి సపోర్ట్ చేసిన జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి వారికి థాంక్స్ అని అన్నారు.
నిర్మాతలు జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అలాంటి ఎమోషనల్ కనెక్టింగ్ మూవీ ‘విమానం’. మా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనుపమ పరమేశ్వరన్ గారికి స్పెషల్ థాంక్స్. జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుందని పేర్కొన్నారు. ‘విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా.. సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు.