Anni manchi sakunamule: అన్నిమంచి శకునములే మూవీ ట్విట్టర్ రివ్యూ
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటించిన అన్ని మంచి శకునములే(anni manchi sakunamule) మూవీ ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను ఇక్కడ తెలుసుకుందాం.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్(santhosh Sobhan) యాక్ట్ చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే'(Anni manchi Sakunamule).ఈ రోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో మాళవిక నాయర్(Malavika Nair) హీరోయిన్గా నటించింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Director Nandini Reddy) ఈ మూవీని తెరకెక్కించారు. స్వప్నదత్, ప్రియాంకదత్ లు ఈ మూవీని నిర్మించారు. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు చెప్పిన ట్విట్టర్ రివ్యూ ఎంటో ఇప్పుడు చుద్దాం.
#AnniManchiSakunamule ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్.. కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడినట్లు ఓ వ్యక్తి పేర్కొన్నారు. కొన్ని మంచి హాస్య సన్నివేశాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే దీంతోపాటు సుదీర్ఘమైన రన్టైమ్, అనేక చోట్ల కథనం స్లోగా కొనసాగుతుందని అంటున్నారు.
నాకు నచ్చిందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. సెకండాఫ్ బాగుందని పేర్కొన్నారు.
పాతకాలం నాటి షావుకారు జానకి, గౌతమి లాంటి పాతతరం స్టోరీ ఈ సినిమాలో వర్క్ అవుట్ కాలేదని మరో వ్యక్తి రాసుకొచ్చారు. ఇంకా ఈ మూవీ గురించి ఏం చెప్పారో ఈ కామెంట్లను ఓసారి చూసేయండి.
#AnniManchiSakunamule A Family Entertainer that had its moments but falters with the overall execution. Has a few decent comedy scenes/feel good moments but the rest is totally dragged out with a lengthy runtime and snail paced narration in many parts. Mediocre!