»Anand Deverakonda Shocking Comments On Fans At Baby Movie Event
Anand Deverakonda: ఇంకా నేనేం పీకలే..షాకింగ్ కామెంట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) అనే సంగతి తెలిసిందే. ఈ యంగ్ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఈ క్రమంలో త్వరలో 'బేబీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన బేబి(baby)సినిమాలో.. వైష్ణవి హీరోయిన్గా నటిస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ‘బేబి’ కోసం యూత్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మెలోడి సాంగ్స్ కుర్రాళ్ల గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.
ఇప్పటికే అనంత శ్రీరామ్ రాసిన ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ అనే సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ సినిమా టీజర్(teaser) అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమిస్తున్నా’ అనే మరో మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకకు నేషనల్ క్రష్ రష్మిక మందన గెస్ట్‌గా హాజరైంది. దాంతో సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇదే వేదిక మీద బేబి సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
జులై 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుందని డైరెక్టర్ ప్రకటించాడు. ఇక ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా.. ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) రౌడీ ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేశాడు. చిన్న దేవరకొండ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ కొన్ని స్లోగన్స్‌తో గోల చేశారు. ఆనంద్.. ఆనంద్.. ఆనంద్ అంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో మైక్ తీసుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.. మన స్లోగాన్ ‘చిన్నకొండ తోపు, దమ్ముంటే ఆపు’ అని హుషారెత్తించాడు.
ఇదే జోషల్ రకరకాల స్లోగాన్స్తో ఆనంద్ అన్న తోపు అంటూ రచ్చ చేశారు. దాంతో ఆనంద్.. ‘ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా.. అసలు నేనేం పీకలే లైఫ్‌లో, ఎందుకు అరుస్తున్నారు? ఇదేదో ట్రోలింగ్‌లా ఉంది’ అంటూ కాస్త ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఇదొక మ్యూజికల్ ఫిల్మ్.. మీరు ఎక్స్పీరియన్స్ చేసింది. బయట అందరికీ చెప్పండి. ఈ సినిమా(movie) కన్నీళ్లతో పాటు జాయ్‌ను కూడా తెప్పిస్తుందని.. అన్నాడు.