HYD: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.42 లక్షల విలువైన 74 డ్రోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ముహమ్మద్, తాజ్, అస్గర్ అనే ముగ్గురు ప్రయాణికులు తమ సామాగ్రిలో రహస్యంగా వీటిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లను తరలిస్తున్నందుకు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేశారు.