MDK: పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతు మస్కూరి లక్ష్మయ్య(57) పురుగు మందు తాగడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. లక్ష్మయ్య మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. ఈనెల 16న కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఆయన పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.