ATP: గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామంలో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో చిదంబరయ్య అనే రైతుకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి చెందాయని కన్నీరుమున్నీరయ్యాడు.