ప్రకాశం: చీమకుర్తి మండలంలోని మర్రిపాలెం వద్ద నెల్లూరుకి వెళ్తున్న రెండు లారీలు సోమవారం ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న గ్రానైట్ లారీకి సాంకేతిక లోపం తలెత్తడంతో మధ్యలో ఆగిపోయింది. వెనక వస్తున్న మరో గ్రానైట్ లారీ ప్రమాదవశాత్తు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న గ్రానైట్ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.