NLR: ఈనెల 14 నుండి 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం తెలిపారు. నెల్లూరు నగరంలోని రేబాల వారి వీధిలో ఉన్నటు వంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ వారోత్సవాల సందర్భంగా బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, ఇతర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.