KRNL: పత్తికొండ పట్టణంలో ఎండ వేడికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా గురువారం ఒక మొబైల్ ఫ్రూట్ జ్యూస్ వాహనం దగ్ధమైంది. హోసూరు రోడ్డులో నివసించే రాజస్తాన్‌కు చెందిన షోభాలాలికి చెందిన ఈ వాహనం ఇంటి వద్ద నిలిపిన సమయంలో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రాకముందే వాహనం పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.8లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.