PDPL: పెద్దపల్లి టీచర్స్ కాలనీలో కూతురిని చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో రామడుగుకు చెందిన సాహితికి పెళ్లైంది. బుధవారం రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చే సరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.