ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్, హెలికాప్టర్ల సాయంతో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకావాలంటూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.