JN: జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో JN మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నరసింహారె
NZB: నవీపేట్ మండలంలోని నందిగాం శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం పెద్ద బండ రాయిపై చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో చిరుత దర్శనమిచ్చే ప
KRNL: ఆదోని మున్సిపాలిటీ 35వ వార్డు అమరావతి నగర్లో పి4 కార్యక్రమాన్ని సచివాలయ అడ్మిన్ నాగబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. 78 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రతీ ఇంటి సమస్యలు
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్సై సాకపురం దివ్య మాట్లాడుతూ.. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల సూ
KKD: హీరో రవితేజను జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరామర్శించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల మరణించారు. శనివారం హైదరాబాదులో రవితేజ నివాసంలో జరిగిన రాజగోపాల్ రాజు దశ దిన కార్యక్రమానికి హాజరై రవితేజను పరామర్శించి
GNTR: ప్రత్తిపాడుకి చెందిన సత్యనారాయణ (42) నష్టాల్లో కౌలు రైతుగా వ్యవసాయం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల ఆర్థికసహాయం ప్రకటించారు. గత
అన్నమయ్య: కార్గిల్ విజయ్ దివస్ రోజు మన దేశ సైనికుల ధైర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మదనపల్లెలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని ఆక్
SRD: రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ హాల్‌ను అతి త్వరలో ప్రారంభించనున్నారు. శనివారం ప్రార
PDPL: భారీ వర్షాలతో గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లాలోని వరద పరిస్థితిని కలెక్