పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమతి ఏజెన్సీకి భారతదేశం మొదటి విడత 2.5 మిలియన్ డాలర్లను విడుదల చేసింది.
అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు చనిపోయారు.
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షంతో కూడిన తుఫాను కారణంగా సోమవారం కనీసం 35 మంది మరణించారు. నంగర్హార్ ప్రావిన్స్‌లో అనేక మంది గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి తెలిపారు.
గత ఐదు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో 'చండీపురా వైరస్' కారణంగా ఆరుగురు చిన్నారులు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ సోమవారం (జూలై 15) తెలిపారు.
బీహార్ రాజధాని పాట్నాలో విషాదం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
కేదార్నాథ్ ధామ్‌లో 228 కిలోల బంగారం కుంభకోణం జరిగిందని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఆరోపించారు.
ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లపై ఆధారపడుతున్నారు. Swiggy, Zomatoలు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లు.