»Flood In Up 17 District Effected By Flood Water Level Of Rivers Increased 8 People Died In 24 Hours
UP Floods : ఉప్పొంగిన నదులు.. మునిగిపోయిన 17జిల్లాలు.. ఎనిమిది మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది.
UP Floods : ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. రప్తి, శారదా, గండక్, ఘఘ్రా, సరయూ, రామగంగ, గంగా నదులు ఉప్పొంగుతున్నాయి. గత 24 గంటల్లో వరద నీటిలో కొట్టుకుపోవడం, పాము కాటు కారణంగా ఎనిమిది మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ తెలిపారు. గత కొన్ని గంటల్లో గతంతో పోలిస్తే వర్షాలు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. నేపాల్ నుంచి నీటిని విడుదల చేయడంతో కొన్ని జిల్లాల్లో వరద నీరు విస్తరించింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ , యుపి పిఎసి సిబ్బంది సహాయం, రెస్క్యూ కోసం మోహరించారు. 17 జిల్లాల్లోని దాదాపు 1,500 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. రప్తి, శారదా, గండక్, ఘఘ్రా, సరయూ, రామగంగ, కువానో, రోహిన్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ తెలిపారు.
వరదల్లో యూపీలోని 17 జిల్లాలు
జిఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ యుపిలోని 17 జిల్లాలు లఖింపూర్ ఖేరీ, బల్రాంపూర్, ఖుషీనగర్, షాజహాన్‌పూర్, బారాబంకి, సీతాపూర్, గోండా, సిద్ధార్థనగర్, బల్లియా, గోరఖ్‌పూర్, బరేలీ, అజంగఢ్, హర్దోయ్, అయోధ్య, బహ్రైచ్, బదౌన్, ఫరూఖాబాద్, దేహాబాద్, ఉన్నావ్, పిలిభిత్ ,శ్రావస్తి వరదలతో ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుండి జూలై 14 వరకు 239.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, పిఎసి బృందాలను రంగంలోకి దింపినట్లు రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,829 వరద సహాయక శిబిరాలు, 1,476 వరద పోస్టులు, 1,145 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు మొత్తం 13,026 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.
8 మంది మృతి
గత 24 గంటల్లో రాష్ట్రంలో వరద నీటిలో కొట్టుకుపోవడం, పాము కాటు కారణంగా ఎనిమిది మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఆగ్రా, కాన్పూర్, బహ్రైచ్, చిత్రకూట్ మరియు ఘాజీపూర్‌లలో మునిగిపోవడం వల్ల ఒక్కొక్కరు మరణించగా, హత్రాస్, ఘాజీపూర్, శ్రావస్తీలలో అధిక వర్షం, పడవ బోల్తా, పాము కాటు కారణంగా ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలోని 17 జిల్లాలు వర్షాలకు ప్రభావితమైనట్లు నివేదిక పేర్కొంది. ఈ జిల్లాల్లో లఖింపూర్ ఖేరీ, బల్రాంపూర్, ఖుషీనగర్, షాజహాన్‌పూర్, బల్లియా, సిద్ధార్థ్ నగర్, బారాబంకి, సీతాపూర్, గోరఖ్‌పూర్, బరేలీ, హర్దోయ్, అయోధ్య, బహ్రైచ్, బదౌన్, ఫరూఖాబాద్, డియోరియా, ఉన్నావ్ ఉన్నాయి. గోరఖ్‌పూర్, బన్సీలో రప్తి నది, గోండాలోని కువానో నది, బల్లియాలోని ఘఘ్రా నది, షాజహాన్‌పూర్‌లోని రామగంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
గోరఖ్‌పూర్‌లోని 47 గ్రామాల్లో వరదలు
రప్తి నది ప్రమాద స్థాయి కంటే 86 సెం.మీ ఎత్తులో ప్రవహిస్తోంది, దీని కారణంగా గోరఖ్‌పూర్‌లోని 47 గ్రామాలు వరద నీటితో చుట్టుముట్టాయి. ఈ గ్రామాలన్నింటిలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు 91 బోట్లను మోహరించారు. దీంతో పాటు నదుల నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా 150 బోట్లను రిజర్వ్‌లో ఉంచారు. వరద నీటితో చుట్టుముట్టబడిన గ్రామాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించడంలో జిల్లా యంత్రాంగం నిరంతరం నిమగ్నమై ఉంది. వరద బాధితులకు ప్రభుత్వం వరద సహాయక సామగ్రిని పంపిణీ చేస్తోంది.