Swiggy-Zomato : ఇటీవల కాలంలో జనాలు ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లపై ఆధారపడుతున్నారు. Swiggy, Zomatoలు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లు. దాదాపు 90శాతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలు ఈ యాప్ ల నుంచే జరుగుతాయి. అలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జొమాటో ద్రవ్యోల్బణం కారణంగా తమ కస్టమర్లను షాక్‌కు గురి చేశాయి. Swiggy-Zomato ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ ఫీజును 20 శాతం పెంచింది. కొంతకాలం క్రితం జొమాటో, స్విగ్గీ రెండూ ఒక్కో ఆర్డర్‌కు రూ. 2 ఫ్లాట్ ఫారమ్ ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించాయి. అలా అలా కంపెనీలు క్రమంగా ఫీజులను పెంచుతున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ-జొమాటో బెంగళూరు, ఢిల్లీ వంటి మార్కెట్లలో కస్టమర్ల నుండి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫారమ్ రుసుమును 20 శాతం రూపాయలకు పెంచింది. గతంలో ఈ మార్కెట్లలో ఈ కంపెనీలు రూ.5 వసూలు చేసేవి. స్విగ్గీ బెంగళూరులో రూ.7 ప్లాట్‌ఫారమ్ ఫీజును కూడా వసూలు చేస్తోంది. అంతకుముందు ఏప్రిల్‌లో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లక్నోతో సహా ప్రధాన నగరాల్లో ఆర్డర్‌కు 25శాతం పెంచి రూ.5కి పెంచింది. అధిక ప్లాట్‌ఫారమ్ ఫీజుల ద్వారా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ప్రకటనలు కూడా ప్రధాన ఆదాయ వనరు. కానీ ఆహారోత్పత్తుల కంపెనీల నుంచి కమీషన్ పెంచడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అందుకే ఫ్లాట్ ఫారమ్ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.